తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య

రాష్ట్రంలో ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ విద్యా సంవత్సరంలో లక్ష మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరడం గమనార్హం. నాణ్యమైన విద్య, ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉండడం విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచిందని నిపుణులు భావిస్తున్నారు.

ఇంటర్​ ప్రవేశాలు

By

Published : Sep 8, 2019, 7:34 AM IST

Updated : Sep 8, 2019, 7:58 AM IST

రాష్ట్రంలో ప్రభుత్వ ఇంటర్మీడియెట్ కళాశాలలకు ఈ ఏడాది విశేష స్పందన లభించింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 404 కాలేజీల్లో ఇంటర్ సాధారణ కోర్సుల్లో 78 వేల 177 మంది చేరగా... వొకేషనల్ కోర్సుల్లో 21 వేల 823 మంది విద్యార్థులు చేరారు. అత్యధికంగా హైదరాబాద్​లో 9 వేల 623 మంది విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరారు. అతి తక్కువగా వరంగల్ గ్రామీణ జిల్లాలో 933 మంది ప్రభుత్వ కళాశాలల్లో చేరారు. ఈసారి పదో తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కావడం సహా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నాణ్యమైన ఉచిత విద్య, ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉండడం కూడా విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని పెంచిందని నిపుణులు భావిస్తున్నారు.

ప్రభుత్వ జూనియర్​ కళాశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య
Last Updated : Sep 8, 2019, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details