తెలంగాణ

telangana

ETV Bharat / state

Monsoon Snacks in Telugu : చల్లని సాయంకాలం వేళ... పోషకాలతో నిండిన స్నాక్స్​... ఎంత ఆరోగ్యమో..!

Healthy Snacks in Monsoon Telugu : ఈ కాలంలో చల్లని వర్షానికి వేడివేడిగా కాస్త స్పైసీగా మిరపకాయ బజ్జీ, పునుగులు, పానీపూరీ, పకోడీ తింటుంటే ఆ కిక్కే వేరబ్బా..! బరువు, డైట్​ అంటూ లెక్కలేనుకొని మరీ తినే మనం నోరు కట్టేసుకోకతప్పదు అనుకుంటాం.. కానీ ఈ వానాకాలంలో అలాంటి తిప్పలు పడకుండా.. ఇటు టేస్టీగా.. అటు హెల్దీగా ఉండే ఈ స్నాక్స్​ను ట్రై చేయండి.

Food
Food

By

Published : Aug 4, 2023, 5:00 PM IST

Rainy Season Healthy Snacks in Telugu : వర్షకాలంలో మొక్కజొన్న కంకులు బాగా దొరుకుతాయి. వాటిని తెచ్చుకొని చక్కగా కాల్చి కాస్త ఉప్పు, కారం, నిమ్మరసం చేర్చి తింటే ఉంటుంది చూడండి అంతే ఇంకా. ఇది తినడం వల్ల ఫైబర్​, యాంటీ ఆక్సిడెంట్లతోపాటు విటమిన్​ సి, మెగ్నీషియం వంటి న్యూట్రియంట్లు శరీరానికి అందుతాయి.

Healthy Snacks in Telugu : సాయంకాలం వేళ వేడి వేడి సమోసా, కప్పు అల్లం టీ... ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. నూనెలో బాగా వేగిన సమోసాలు తింటే కెలోరీల సమస్య వస్తుంది కదా..! అచ్చంగా బంగాలదుంపతో చేసినట్టే క్యారెట్​, బీట్​రూట్​, బఠాణీతో చేసుకోవచ్చు. ఏం లేదండి.. క్యారెట్​, బీట్​రూట్​లను చిన్న ముక్కలుగా కోయండి.. బఠాణీసు కోసి పెట్టుకున్న ముక్కలు అన్ని కలిపి ఉడికించండి. వాటికి సన్నగా తరిగిన ఉల్లి, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం చేర్చి సమోసాల వత్తుకోవాలి. పైన పలుచని పొరకి నూనెరాసి , అవెన్​లో పెట్టేస్తే సరి. ఇలా కాదనుకుంటే ఎయిర్​ ఫ్రయర్​లో కుక్​ చేసుకున్నా మంచిదే. కెలోరీలు తగ్గుతాయి.. శరీరానికి పోషకాలు అందుతాయి.

స్వీట్​కార్న్​తో ఎన్నో పోషకాలు: స్వీట్​కార్న్​ తీసుకొని ఉడిగించి గింజలము తీసుకోండి. ఇప్పుడు దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాట, కీర ముక్కలని చేర్చండి. అందులోకి కాస్త ఉప్పు, నిమ్మరసం, మిరియాల పొడి కలిపి తినండి. విటమిన్లు, ఫైబర్​, యాంటీ ఆక్సిండెంట్లతో ఉన్న స్నాక్ ఇది.

మొలకెత్తినవి ఇలా తినండి సూపర్​గా ఉంటాయి:సహజంగా అందరు మొలకెత్తిన గింజలను తింటారు కానీ ఈ సారికి ఇలా ట్రై చేయండి. శనగలు, పెసర్లు ఇలా మీకు నచ్చిన రెండు లేదా మూడు రకాల గింజలను నానబెట్టి మొలకెత్తాక అదే నీటిలో వాటిని ఉడికించండి. వీటిలో ఉడికించిన పల్లీలు, టమాట, కీర ముక్కలు వేయండి. దాంట్లోకి సరిపడ ఉప్పు, మిరియాల పొడి చేర్చి తినండి. ఈ స్నాక్ జీర్ణప్రక్రియను సులభతరం చేయడమే కాకశరీరాన్ని ఉల్లాసంగా ఉంచుతుంది.

అటుకులను పోపు వేసి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. కానీ దాని వల్ల జరిగే ప్రయోజనం చాలా మందికి తెలిసి ఉండదు. అటుకులను దోరగా వేయించి ఉప్పు, కారం, పల్లీలు చేర్చి తినడం వల్ల ఫైబర్​తోపాటు కార్బోహైడ్రేట్లు శరీరానికి మెండుగా అందుతాయి. పసుపు, కరివేపాకుతో కలిపి తింటే రుచితోపాటు యాంటీ బ్యాక్టీరియల్​, యాంటీ ఇన్​ఫ్లమేటరీ గుణాలతో శరీరానికి ఎంతో ఆరోగ్యకరం.

గుప్పెడు పల్లీలు తీసుకొండి దానిలోకి కొద్ది మొత్తంలో బాదం, జీడిపప్పు కలిపి వేయించండి. ఇప్పుడు జీలకర్ర, పసుపు, దాల్చినచెక్క పొడులతోపాటు కాస్త ఉప్పు కలిపి తింటే సరి. రుచికి రుచి.. ఇంకా హెల్తీ కొవ్వులతోపాటు ప్రొటీన్​, మినరల్స్ శరీరానికి అందుతాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details