తెలంగాణకు రూ.35వేల కోట్ల నిధులు ఇచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రామగుండం ఎరువుల పరిశ్రమను పునరుద్ధరించామని పేర్కొన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా ఎన్నికల ప్రచారంలో ఆయన తన ప్రసంగంతో కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. ఐదేళ్లలో దేశానికి, తెలంగాణకు చేసిన అభివృద్ధిని వివరించారు. దిల్లీ తరహాలో హైదరాబాద్ మెట్రోను విస్తరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ కోసం ఎంతో చేశా... ఇంకా చేస్తా: మోదీ - modi telangana campaign
"భాజపాకు ఓటెయ్యాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మీరు దృఢమైన ప్రభుత్వాన్ని ఇస్తే మేము దృఢమైన దేశాన్ని నిర్మిస్తాం. ఇప్పుడు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదు మోదీ. తెలంగాణకు 35వేల కోట్ల నిధులిచ్చాం... రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తాం": నరేంద్ర మోదీ
modi