మోదీ సర్కారు కర్షకులను దగా చేసిందని కోదండ రెడ్డి ఆరోపించారు. మోదీ సర్కారు రైతులను దగా చేసిందని కాంగ్రెస్ కిసాన్ సెల్ ధ్వజమెత్తింది. కనీస మద్దతు ధర గురించి ప్రధాని పార్లమెంట్‌లో ఎప్పుడూ మాట్లాడలేదని కోదండరెడ్డి విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు పంట బీమా పేరుతో లబ్ధి చేకూర్చారని ఆరోపించారు. కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొచ్చారని తెలిపారు.
మద్దతు ధర ఇస్తేనే రైతులకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తెలిపారు. కేంద్రం అందిస్తున్న చెక్కులను తిరిగి పంపి వినూత్న రీతిలో నిరసన తెలపాలని అన్వేష్ రెడ్డి పిలుపునిచ్చారు.