గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెంలో తెదేపా శ్రేణులతో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ మట్లాడారు. జగన్... మోదీ... కేసీఆర్ ఒక్కటై... హైదరాబాద్‌లో ఉన్న తమ పార్టీ నాయకులు... బంధువులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. జగన్‌ను అడ్డంపెట్టుకొని రాష్ట్రంపై అధికారం చలాయించాలని చూస్తున్నారని విమర్శించారు.
'మన కష్టాలకు కేసీఆరే కారణం' - jagan
విభజన సమయంలో రాష్ట్రానికి అన్యాయం జరగడానికి తెలంగాణ సీఎం కేసీఆరే కారణమని... దిల్లీ నేతలతో కుమ్మక్కై హైదరాబాద్‌ను తెలంగాణకు... అప్పులు... ఆంధ్రాకు వచ్చేలా చేశారని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ గల్లా
జగన్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనన్న జయదేవ్... 25 మంది ఎంపీలను గెలిపిస్తే దిల్లీలో చక్రం తిప్పగలమని పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఈడీనుంచి నోటీసులు పంపించారన్న ఎంపీ... 8 గంటలపాటు తనను విచారరించారని చెప్పారు. తన కుటుంబ సభ్యులపై దాడులకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎవ్వరికీ భయపడమని స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తారని ఉద్ఘాటించారు.
ఇవీ చూడండి:తెరాస శంఖారావం
Last Updated : Mar 6, 2019, 1:19 PM IST