తెలంగాణ

telangana

ETV Bharat / state

'గవర్నర్​ పట్ల చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి'

MLC Paadi KaushikReddy apologized to Governor: గవర్నర్​పై వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను కౌశిక్​రెడ్డికి ఈనెల 14న నేషనల్ ఉమెన్ కమిషన్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డి జాతీయ మహిళా కమిషన్​ ఎదుట హాజరై గవర్నర్ తమిళిసై పట్ల చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు గవర్నర్​కి లిఖితపూర్వక క్షమాపణ చెబుతానని కౌశిక్​రెడ్డి మహిళా కమిషన్​కు తెలిపారు.

MLC Paadi KaushikReddy apologized to Governor
MLC Paadi KaushikReddy apologized to Governor

By

Published : Feb 21, 2023, 10:14 PM IST

MLC Paadi KaushikReddy apologized to Governor: గవర్నర్‌ తమిళిసై పట్ల చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి జాతీయ మహిళా కమిషన్‌ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న ఆయన దిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసైకి లిఖితపూర్వక క్షమాపణ చెబుతానని కౌశిక్​రెడ్డి మహిళా కమిషన్‌కు తెలిపారు. క్షమాపణ పత్రం మహిళా కమిషన్‌కు కూడా పంపుతానని ఆయన చెప్పారు.

ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డికి ఈనెల 14న నేషనల్ ఉమెన్ కమిషన్ నోటీసులు పంపిన విషయం విధితమే. ఆ మేరకు ఆయనను వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని మహిళా కమిషన్ ఆదేశించింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్ల పరుష పదజాలంతో వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మహిళా కమిషన్ ఈ నోటీసులు పంపింది.

గవర్నర్​పై ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో బీసీ రాజకీయ ఐకాస ఫిర్యాదు చేసింది. కౌశిక్​రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుకై డీజీపీకి ఆదేశాలివ్వాలని, ఐకాస ఛైర్మన్ రాచాల యుగేందర్​గౌడ్ ఎస్‌హెచ్‌ఆర్సీని కోరారు.

గవర్నర్​పై వివాదాస్పద వ్యాఖ్యలు: పాడి కౌశిక్​రెడ్డి జనవరి 25న జమ్మికుంటలో నిర్వహించిన ఓ సమావేశంలో రాష్ట్ర ప్రథమ పౌరురాలు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ, శాసనమండలి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా తన దగ్గరే అంటి పెట్టుకుంటారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ వరకు వెళ్లింది.

ఎమ్మెల్సీని బర్తరఫ్ చేయాలి: మరోవైపు గవర్నర్ తమిళిసైపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కౌశిక్​రెడ్డిని బర్తరఫ్ చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. రాజ్యాంగ అత్యుత్తమ పదవిలో ఉన్న గవర్నర్​ను మహిళ అని కూడా చూడకుండా వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. కౌశిక్​రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details