విద్యారంగ అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమానికి కృషి చేస్తున్న టీఎస్ యూటీఎఫ్ సంఘంలో సభ్యులుగా చేరి బలోపేతం చేయాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. 2020-21 సంవత్సరానికి ఆన్లైన్ సభ్యత్వ నమోదును హైదరాబాద్లో ప్రారంభించారు. అభివృద్ధి చెందిన సాంకేతికతను వినియోగించుకోవటంలో ముందుంటున్నందుకు రాష్ట్ర కమిటీని అభినందించారు.
టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్సీ
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యుూటీఎఫ్) 2020-21 సంవత్సరానికి ఆన్లైన్ సభ్యత్వ నమోదును హైదరాబాద్లో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ప్రారంభించారు. కొవిడ్ కారణంగా పాఠశాలలు ప్రారంభం కాకపోవటం వల్ల ఆన్లైన్ ద్వారా ఉపాధ్యాయుల సభ్యత్వం సేకరించటానికి సోషల్ మీడియా కమిటీ ఏర్పాట్లు చేసిందన్నారు.
టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్సీ
ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు, సంఘ సమావేశాలు ఆన్లైన్లో నిర్వహిస్తున్నామన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్వహిస్తున్న ఐక్య ఉద్యమాల్లో టీఎస్ యూటీఎఫ్ క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని అన్నారు.
ఇదీచూడండి..టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్