తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు

ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సాయిబాబా ఆలయ సిబ్బందికి ఐఎస్‌వో సర్టిఫికెట్ అందించారు.

mlc kavitha prayars in dilshuknagar saibaba temple
దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు

By

Published : Dec 10, 2020, 9:42 AM IST

Updated : Dec 10, 2020, 10:11 AM IST

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలికారు. అనంతరం సాయిబాబా ఆలయానికి వచ్చిన ఐఎస్ఓ సర్టిఫికేట్​ను ఆలయ కమిటీకి అందజేశారు.

భక్తులకు వసతుల కల్పన, ప్రసాదానికి సంబంధించి, సాయిబాబా టెంపుల్​కు ఐఎస్ఓ సర్టిఫికేట్ రావడం గొప్ప విషయమన్న ఎమ్మెల్సీ కవిత.. దేవాలయల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్, ఆలయ ఛైర్మన్ శివయ్య, ఐఎస్ఓ సర్టిఫికేషన్ మెంబర్ డా. విజయ రంగ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:టీఎస్ఆర్టీసీ కార్గో మరో అడుగు... ఇంటికే పార్శిల్‌..

Last Updated : Dec 10, 2020, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details