తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరదసాయం నిలిపివేత పాపం కాంగ్రెస్, భాజపాలదే..' - nominations for ghmc election

కాంగ్రెస్, భాజపా పార్టీలు... పేద ప్రజల నోటి కాడి ముద్దను లాక్కున్నాయని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. వరదల సమయంలో నష్టపోయిన వారికి ప్రభుత్వం సహాయం అందిస్తుంటే... చూసి ఓర్వాలేక ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని తెలిపారు.

mlc-kalvakuntla-kavitha-serious-on-congress-and-bjp
పేద ప్రజల నోటి కాడి ముద్దను లాగేసుకున్నారు: ఎమ్మెల్సీ కవిత

By

Published : Nov 19, 2020, 1:36 PM IST

గాంధీనగర్ డివిజన్ తెరాస అభ్యర్థి అబిడ్స్​లోని జీహెచ్​ఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. వరదల్లో నష్టపోయిన పేద ప్రజలకు ప్రభుత్వం రూ.10వేల ఆర్థిక సహాయం చేస్తుంటే... ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి... పేద ప్రజల నోటి కాడి ముద్దను లాక్కుంటున్నారని కవిత వ్యాఖ్యానించారు.

పేద ప్రజల నోటి కాడి ముద్దను లాగేసుకున్నారు: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ మహా నగరాన్ని ప్రభుత్వం రూ.67వేల కోట్లతో అభివృద్ధి చేసిందని ఆమె వెల్లడించారు. జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు... వరదలు వచ్చినప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ఓటు అడిగే హక్కులేదని స్పష్టం చేశారు. తెరాస జైత్రయాత్ర గాంధీనగర్ డివిజన్ నుంచే ప్రారంభమవుతుందన్నారు. అంతకుముందు గాంధీనగర్​లోని లక్ష్మి గణపతి ఆలయాన్ని కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చూడండి:'ఎంఐఎంతో పొత్తు లేదు... తెరాసదే మేయర్ పీఠం'

ABOUT THE AUTHOR

...view details