తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి' - హైదరాబాద్​ తాజా వార్తలు

ఆరోగ్య శ్రీ రోగుల పట్ల కార్పోరేట్ ఆసుపత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. శాసనమండలిలో జరిగిన చర్చలో భాగంగా జీవన్ రెడ్డి పలు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నాని సూచించారు.

mlc jeevanreddy in mandali sessions
'రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి'

By

Published : Mar 12, 2020, 4:46 PM IST

నూతన రాష్ట్రం వస్తే విద్యా, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఆశించిన విద్యార్థులకు నిరాశ ఎదురవుతోందని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి విమర్శించారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన విద్యార్థుల పట్ల పోలీసులు నియంతృత్వంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. గ్రూప్స్‌ నోటిఫికేషన్ ఇప్పటికీ లేదని... యూనివర్శిటీల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయని... ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌ అమలు కావడం లేదని పేర్కొన్నారు.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని దుయ్యబట్టారు. పండుగపూట నిత్యావసరాలు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మండలిలో వివరించారు. గతంలో కంటే 2020-21 బడ్జెట్‌లో అతితక్కువ కేటాయింపులు చేశారని... రుణభారం, మద్యం విక్రయాల్లో మాత్రమే నేడు పురోగతి కనపడుతోందని మండిపడ్డారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కోత విధించారని వీటన్నింటిపైనా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.

'రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి'

ఇదీ చదవండిఃకరోనా నుంచి కాపాడుకోండిలా!

ABOUT THE AUTHOR

...view details