తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ - ఎమ్మెల్సీ ఎన్నికలు

శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ ఎన్నికలను ప్రతిపక్ష కాంగ్రెస్​ బహిష్కరించింది.

ఎమ్మెల్సీ ఎన్నికలు

By

Published : Mar 12, 2019, 10:00 AM IST

Updated : Mar 12, 2019, 10:21 AM IST

ఓటింగ్​కు హాజరవుతున్న ఎమ్మెల్యేలు
శాసనసభ్యుల కోటా​ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్​ అసెంబ్లీ కమిటీ హాల్​-1లో ప్రారంభమైంది. ఐదు స్థానాల కోసం ఆరుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్​ జరుగనుంది. అనంతరం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఇప్పటికే ఈ ఎన్నికలను కాంగ్రెస్​ బహిష్కరించింది. తెదేపా, భాజపాలు సైతం ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. తెరాస అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే కానుంది. ఎన్నికల పరిశీలకుడిగా ఐఏఎస్​ అధికారి శశాంక్​ గోయల్​ను ఈసీ నియమించింది.
Last Updated : Mar 12, 2019, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details