ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. రెండు నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు. తెరాస తరఫున మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా... శ్రమజీవి పార్టీ నుంచి భోజ్ రాజ్ కోయల్కర్ నామినేషన్ వేశారు. యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటం వల్ల ఈ ఉపఎన్నిక జరుగుతున్నది. నిబంధనల ప్రకారం పది మంది ఎమ్మెల్యేలు అభ్యర్థిని ప్రతిపాదించాల్సి ఉంటుంది. భోజ్ రాజ్ నామినేషన్‌తో ఒక్క ఎమ్మెల్యే ప్రతిపాదన కూడా సమర్పించలేదు. ఈనెల 16న ఆయన నామినేషన్‌ను తిరస్కరించే అవకాశం ఉంది. ఈనెల 19న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత...గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికను అధికారులు లాంఛనంగా ప్రకటించనున్నారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన నామినేషన్ గడువు - ఎమ్మెల్యే కోటా
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. రెండు నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు.
MLC