హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని బాపూజీ నగర్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహంలో పలువురు విద్యార్థులు కరోనా బారినపడ్డారు. విషయం తెలుసుకున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ టి.ఎన్. శ్రీనివాస్‌తో కలిసి విద్యార్థులకు ఉచితంగా శానిటైజర్లు, మాస్కులు, ఆహారం, పాలు, గుడ్లు అందజేశారు.
విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు అందించిన ఎమ్మెల్యే సాయన్న
బోయిన్‌పల్లిలోని బాపూజీ నగర్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ బాలుర వసతి గృహంలో కరోనా బారినపడిన విద్యార్థులకు ఎమ్మెల్యే సాయన్న ఉచితంగా శానిటైజర్లు, మాస్కులు, ఆహారం అందించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే తమను సంప్రదించాలని నిర్వాహకులకు సూచించారు.
విద్యార్థులకు శానిటైజర్లు, మాస్కులు అందించిన ఎమ్మెల్యే సాయన్న
విద్యార్థులకు ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమను సంప్రదించాలని హాస్టల్ ఇంఛార్జీకి సూచించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని, హాస్టల్ పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ చేయించామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి:గురుకులంలో కరోనా కలకలం.. మొత్తం 26 మందికి పాజిటివ్