కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో గోషామాహల్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరి క్షేమం తమ బాధ్యత అని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అందుకోసం తన మూడు వాహనాలు సిద్ధంగా ఉంచినట్టు తెలిపారు. ఏ సమయంలో ఫోన్ చేసినా పది నిమిషాల్లోనే వాహనాలు వచ్చి బాధితులకు సహాయం చేస్తామన్నారు.
ఆ నియోజకవర్గంలో ప్రజలకు.. ఎమ్మెల్యే వాహనాలు
తమ నియోజకవర్గ ప్రజల కోసం తన మూడు వాహనాలు డ్రైవర్లతోపాటు సిద్ధంగా ఉంచానని గోషామాహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పేర్కొన్నారు. ఏ సమయంలో అవసరమొచ్చి ఫోన్ చేసినా 10 నిమిషాల్లోనే మీ ఇంటి వద్దకు వచ్చి సహాయం అందజేస్తామన్నారు.
ఆ నియోజకవర్గంలో ప్రజలకు.. ఎమ్మెల్యే వాహనాలు
ప్రధాని మోదీ చేపట్టిన ముందు జాగ్రత్త చర్యలకు కృతజ్ఞతగా నమోజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏడున్నర గంటలకు జ్యోతిని వెలిగించి సంఘీభావం తెలిపారు. శానిటైజేషన్ పనుల మొదటి దశను హనుమాన్ మందిర్ నుంచి పురాణపూల్ గాంధీ విగ్రహం వరకు మొదలుపెట్టారు.
ఇదీ చూడండి :బాధ్యతగా ఉండకపోతే... తప్పదు భారీ మూల్యం