Raja Singh Comments on TS Intelligence : ఇటీవలే జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఐబీ తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని మండిపడ్డారు. ముఖ్యమైన పనులపై బయటకు వెళ్తున్నప్పుడు దారి మధ్యలో వాహనం ఆగిపోతోందని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న నాకు ఇలాంటి వాహనం ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తన ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని పేర్కొన్నారు.
ఉగ్రవాదుల నుంచి ముప్పు అంటే.. ఇలాంటి వాహనం ఇస్తారా..? : రాజాసింగ్ - తెలంగాణ ఇంటెలిజెన్స్‌పై రాజాసింగ్ ఫైర్
Raja Singh Comments on TS Intelligence : భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురవుతోందని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న తనకు ఇలాంటి వాహనం ఇస్తారా అని నిలదీశారు.
Raja Singh Comments on Telangana Intelligence : ‘‘కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారు. 4 నెలల క్రితం రోడ్డు మధ్యలో ఆ వాహనం ఆగిపోతే ఇంటెలిజెన్స్ కార్యాలయానికి పంపించాను. మరమ్మతులు చేసి అదే వాహనాన్ని మళ్లీ ఇచ్చారు. 2 నెలల క్రితం నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లే సమయంలోనూ ఆగిపోయింది. గన్‌మెన్ల సాయంతో ఆటోలో కోర్టుకు వెళ్లాను. అఫ్జల్‌గంజ్ వద్ద మరోసారి ఆగిపోయింది. అప్పుడు సొంత వాహనం రప్పించుకుని వెళ్లాను. ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచి ఉన్న నాకు ఇంటెలిజెన్స్ అధికారులు ఇలాంటి వాహనం ఇచ్చారు’’ అని రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు.