నిరాశ్రయులకు, వలస కార్మికులకు, దివ్యాంగులకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే ముఠాగోపాల్ పంపిణీ చేశారు. సమాజంలో అభాగ్యులను, అనాథలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు.
నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - MLA Mutagopal Latest News
ఎమ్మెల్యే ముఠాగోపాల్ హైదరాబాద్లోని నిరాశ్రయులకు, వలస కార్మికులకు, దివ్యాంగులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
నిరాశ్రయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
గాంధీ జయంతి పురస్కరించుకుని జాయ్ ఆఫ్ గివింగ్లో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో సోసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ, రెయిన్బో హోమ్స్, బాల్యమిత్ర నెట్వర్క్ ఆధ్వర్యంలో నగరంలోని పిల్లలకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. కరోనా నేపథ్యంలో నిరాశ్రయులకు, వలస కార్మికులకు, దివ్యాంగులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. కరోనా నివారణకు అందరూ భౌతిక దూరాన్ని పాటిస్తూ.. మాస్కూలను తప్పని సరిగా ధరించాలని సూచించారు.