తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - lockdown

హైదరాబాద్​ అడిక్​మెట్​ డివిజన్​లోని పేదప్రజలకు ముషీరాబాద్​ ఎమ్మెల్యే నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ సమయంలో నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకురావాలని కోరారు.

mla muta gopal groceries distribution in hyerabad
పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

By

Published : Apr 28, 2020, 10:02 PM IST

లాక్​డౌన్ సమయంలో దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కోరారు. ఉపాధి కోల్పోయిన అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్​ అడిక్​మెట్​ డివిజన్​లోని పలు ప్రాంతాల్లో నివాసముంటున్న పేదప్రజలకు శాసనసభ్యులు ముఠా గోపాల్ నిత్యావసర సరకులను అందజేశారు. ప్రజలు సంయమనంతో వ్యవహరించి కరోనాను తరిమివేయడానికి కంకణబద్ధులు కావాలని ఆయన సూచించారు.

ABOUT THE AUTHOR

...view details