పేద ప్రజలను, కార్మికులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బస్తీ ప్రజలను, జీహెచ్ఎంసీ కార్మికులను ఆదుకోవడానికి పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆవరణలో ఎంఏఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్తీవాసులకు నిత్యావసర సరకులను ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ లాస్య నందిత పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - corona virus
హైదరాబాద్ దోమలగూడలో ఎంఏఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్తీవాసులకు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. అనంతరం ముషీరాబాద్‌లో జీహెచ్ఎంసీ కార్మికులకు సరకులను అందజేశారు. పేదప్రజలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ముషీరాబాద్‌లోని వాలీబాల్ మైదానంలో తెరాస నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ కార్మికులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిత్యావసర సరకులను అందజేశారు. సమాజంలోని అభాగ్యులను, పేదలను ఆదుకోవడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే చెప్పారు.
ఇవీ చూడండి: ప్రజల ముందుకు నిజాన్ని తీసుకొచ్చిన ఈనాడుకు అభినందనలు