హైదరాబాద్ ముషీరాబాద్‌లోని లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. ప్రభుత్వం సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. అనారోగ్యానికి గురైన బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి సాయం చేస్తున్నామని చెప్పారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తన నియోజకవర్గంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్
కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. భౌతిక దూరం పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: Etala: 'హుజూరాబాద్‌లో కౌరవులు, పాండవులకు మధ్య యుద్ధం'