ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు అమరవీరులకు కాంగ్రెస్ సలాం పేరుతో మాదాపూర్‌లోని తన నివాసంలో కూమార్తె జయారెడ్డితో కలిసి మౌన దీక్ష చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇండియా-చైనా సరిహద్దులో చైనా ఆర్మీతో పోరాడి అమరులైన వీరసైనికుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. కర్నల్ సంతోషబాబుతోపాటు అమరులైన 20మంది జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమరులైన జవాన్ల కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. చైనా ఆక్రమణలో ఉన్న భారత్ దేశ భూమిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సైనికుల త్యాగాలు మరువలేనివి: జగ్గారెడ్డి - congress latest news
చైనా ఆర్మీతో పోరాడి అమరులైన వీరసైనికుల త్యాగాలు మరువలేనివని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఏఐసీసీ, పీసీసీ ఆదేశాల మేరకు అమరవీరులకు కాంగ్రెస్ సలాం పేరుతో మాదాపూర్‌లోని తన నివాసంలో కూమార్తె జయారెడ్డితో కలిసి మౌన దీక్ష చేశారు.
సైనికుల త్యాగాలు మరువలేనివి: జగ్గారెడ్డి