తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉత్తమ్​పై చేసిన వ్యాఖ్యలను తలసాని ఉపసంహరించుకోవాలి'

మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​పై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఉత్తమ్​పై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. మంత్రి తలసాని పీసీసీ చీఫ్​ ఉత్తమ్​కుమార్​ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

mla jaggareddy comments minister talasani srinivas yadav
'మంత్రి తలసాని ఉత్తమ్​పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి'

By

Published : May 8, 2020, 8:23 PM IST

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలను తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డిమాండ్‌ చేశారు. లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వ వైఫల్యాలున్నా, ప్రజలు ఇబ్బంది పడినా, అధిష్ఠానం నిర్ణయం మేరకు మేము సహకరిస్తూనే వచ్చామన్నారు. రాజకీయంగా ఎక్కడ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు. తెరాసలో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా డమ్మీలేనని, ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్​ 'వన్ మ్యాన్ షో' నడుస్తోందని ఆరోపించారు. దేశం కోసం పని చేసిన వ్యక్తి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని, సైనికులను అవమానపరిచేట్లు మాట్లాడిన మంత్రి తలసాని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో లాక్​డౌన్ ఉన్నట్లా.. లేనట్లా... అని ప్రశ్నించిన ఆయన.. రాష్ట్రంలో జరగరానిది ఏమైనా జరిగితే అందుకు కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. మంత్రి తలసాని ఏ రోజు సంగారెడ్డికి వచ్చినా అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. గతంలో కేసీఆర్‌ బట్టలు ఊడదీసి కొడతానని చెప్పిన తలసాని... ఇప్పుడు కేసీఆర్‌కు భజన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇవీ చూడండి: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details