Etela Fired on CM KCR: ధాన్యం కొనుగోలు చేయకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్.. అధికారం నుంచి తప్పుకోవాలని హుజూరాబాద్ భాజుపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ మతి తప్పిన ఆలోచనలతో రైతులు మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు కేటాయించకుండా ఆసుపత్రుల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని.. నాంపల్లి భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి తప్పులు చేస్తే.. శిక్ష ఎంజీఎం సూపరింటెండెంట్ అనుభవించాలా అని మండిపడ్డారు.
"ప్రతి గింజను కొంటామన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన మాట నిలబెట్టుకోవాలి. లేనిపక్షంలో అధికారం నుంచి తప్పుకోవాలి. మాపై కోపాన్ని రైతులు, పౌల్ట్రీ రంగంపై చూపిస్తున్నారు. కోటి మందికి రైతు బంధు ఇస్తే.. 35 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు పండిస్తున్నారు. పంటలు వేయకుండా రైతుల కళ్లలో మట్టి కొట్టి వాళ్ల కన్నీళ్లు చూస్తున్నారు. 17 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం సిగ్గుచేటు." -ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే
తప్పుదోవ పట్టించేందుకు యత్నం: పెంచిన విద్యుత్, బస్ ఛార్జీల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని ఈటల ఆరోపించారు. 17వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపు సిగ్గుమాలిన చర్య అన్నారు. కేసీఆర్.. లక్షలాది మంది రైతులు, పౌల్ట్రీ రంగం ఉసురు పోసుకుంటున్నారన్నారు. తమపై కోపాన్ని అధికారం ఇచ్చిన రైతులపై చూపుతున్నారని విమర్శించారు. కాళ్ల కింద భూమి కదిలిపోతున్నందునే కేసీఆర్ నెపాన్ని కేంద్రంపై వేస్తున్నాడని ఆరోపించారు.
పంటలు వేయకుండా కళ్లలో మట్టికొట్టి అన్నదాతల కనీళ్లు చూస్తున్నారని ఈటల దుయ్యబట్టారు. పంజాబ్లో రెండో పంట గోధుమలు వేస్తారని తెలిసి కూడా అవాస్తవాలు చెప్తున్నారన్నారని విమర్శించారు. ప్రతి గింజను కొంటామన్న ముఖ్యమంత్రి.. మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందన్న ఆశతో రైతులు కోతకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఏపీ, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలకు సిద్ధమయ్యాయని పేర్కొన్నారు.
'మాట నిలబెట్టుకోవాలి.. లేదంటే పదవి నుంచి తప్పుకోవాలి' ఇదీ చదవండి:ఆడ, మగ వరి.. అందమైన మడి.. ఎక్కడో తెలుసా..?