లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా ఉపాధి లేక ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. అలాంటి వారికి సహాయం అందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని వెంకటేశ్వర కాలనీలో 75 కుటుంబాలకు ఎమ్మెల్యే దానం నిత్యావసర సరుకులు అందజేశారు.
పేద కుటుంబాలకు సరకులు పంపిణీ చేసిన దానం - khairatabad mla dhanam nagendar
హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని వెంకటేశ్వర కాలనీలో పేద కుటుంబాలకు అరుంధతి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ సరకులు పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
పేద కుటుంబాలకు సరకులు పంపిణీ చేసిన దానం నాగేందర్
అరుంధతి వెల్పేర్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు, సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. లాక్‌డౌన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అరుంధతి వెల్పేర్ అసోసియేషన్ సంస్థ నిరంతరంగా వివిధ రూపాల్లో సేవ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషంగా ఉందని దానం నాగేందర్ అన్నారు.
ఇవీ చూడండి: కేసీఆర్‌కు ఎస్ఎల్బీసీ అంటే అంత భయమెందుకు: ఉత్తమ్