తెలంగాణ

telangana

ETV Bharat / state

తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోంది: దానం - Mla danam nagender break the lock down rule

ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటి వద్ద భౌతిక దూరం పాటించాలనే నిబంధన బేఖాతరవుతోంది. నిత్యావసరాల పంపిణీలో భౌతికదూరం పాటించకుండానే వాటిని పేదలకు అందజేస్తున్నారు.

'తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోంది'
'తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోంది'

By

Published : Apr 10, 2020, 5:04 PM IST

Updated : Apr 10, 2020, 7:57 PM IST

కరోనా వైరస్ నియంత్రణ కోసం భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా.. ఖైరతాబాద్​ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంటి వద్ద ఆ నిబంధనలు బేఖాతరవుతున్నాయి. లాక్​డౌన్ నేపథ్యంలో డివిజన్​లోని నిరుపేదలకు ఎమ్మెల్యే.. కొన్ని రోజులుగా నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న నిరుపేదలు, వలస కూలీలు దానం ఇంటి వద్ద పెద్దసంఖ్యలో వరుస కట్టారు. వచ్చిన వారితో భౌతికదూరం పాటించకుండానే.. ఎమ్మెల్యే దానం.. బియ్యం, పప్పులను పంపిణీ చేస్తున్నారు.

అక్కడే ఉన్న పోలీసులు, దానం వ్యక్తిగత సిబ్బంది ప్రజలకు విజ్ఞప్తి చేసినా వినిపించుకోవడం లేదు. ఈ విషయంపై ఎమ్మెల్యే దానం నాగేందర్​ను ఈటీవీ భారత్​ వివరణ కోరగా... ప్రజలకు పదేపదే చెబుతున్నా వినడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తోందని వివరించారు.

ఇదీ చూడండి:'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం'

Last Updated : Apr 10, 2020, 7:57 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details