తెలంగాణ

telangana

ETV Bharat / state

దంపతుల మధ్య మనస్పర్ధలు.. భర్త బలవన్మరణం

దంపతుల మధ్య కలహాలతో భర్త ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన బోయిన్​ పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

By

Published : Oct 29, 2019, 5:06 AM IST

Updated : Oct 29, 2019, 7:55 AM IST

హైదరాబాద్ బోయిన్​ పల్లిలోని నాగిరెడ్డి కాలనీలో శ్రీకాంత్ దంపతులు కాపురం ఉంటున్నారు. సంసారం సజావుగా సాగుతున్న తరుణంలో వారి మధ్య మనస్పర్ధలతో వాగ్వాదాలు చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తరచుగా ఘర్షణలు జరుగుతున్న క్రమంలో శ్రీకాంత్ భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన భర్త శ్రీకాంత్... ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

దంపతుల మధ్య మనస్పర్ధలు.. భర్త బలవన్మరణం
Last Updated : Oct 29, 2019, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details