Mint Museum in Hyderabad: అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హైదరాబాద్ సైఫాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేయాలని కేంద్రం ఆధీనంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంకల్పించింది. ఇందులో భాగంగా 1901 నాటి శిథిలావస్థకు చేరిన భవనాన్ని పునరుద్ధరించడంతో పాటు సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దింది. జూన్ 7న ప్రారంభించిన ఈ మ్యూజియాన్ని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు.
భాగ్యనగరంలో కరెన్సీ ముద్రణకు వాడిన లండన్ మిషన్ ప్రదర్శన: మింట్ పరిసర ప్రాంతాలతో పాటు మ్యూజియంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల నాణేలను తిలకించారు. దేశచరిత్ర, గతంలో ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేసిందనే విషయంపై యువతరానికి అవగాహన కల్పించేందుకే మ్యూజియం ఏర్పాటు చేసినట్లు కిషన్‌రెడ్డికి అధికారులు వివరించారు. వందేళ్ల కిందట భాగ్యనగరంలో కరెన్సీ ముద్రణకు వాడిన లండన్ నుంచి తెచ్చిన యంత్రాలను ప్రదర్శనలో ఉంచినట్లు తెలిపారు.