తెలంగాణ

telangana

ETV Bharat / state

'హైదరాబాద్​ను ఉత్తమ చికిత్స అందించే ప్రాంతంగా తీర్చిదిద్దుతాం' - minster eetela rajendar

బంజారాహిల్స్​లోని ఓ హోటల్​లో ఏర్పాటు చేసిన వైద్య విభూషణ్​ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి ఈటల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోగులకు పునర్జన్మ అందించే వైద్యులను సన్మానించడం అభినందనీయమన్నారు.

minster eetela rajendar attended to award function in hyderabad
'హైదరాబాద్​ను ఉత్తమ చికిత్స అందించే ప్రాంతంగా తీర్చిదిద్దుతాం'

By

Published : Dec 30, 2019, 7:24 AM IST

Updated : Dec 30, 2019, 8:41 AM IST

అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వైద్యం అందించి పునర్జన్మ ప్రసాదించే వైద్యులు దైవ్యంతో సమానమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఫోర్‌ స్క్రీన్‌ సంస్థ ఆధ్వర్యంలో వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన వైద్యులకు హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన వైద్య విభూషణ్‌ అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన పలువురు వైద్యులకు అవార్డులు అందజేశారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులకు పేద, ధనిక అనే బేధం లేకుండా వైద్యం అందించే వారిని గుర్తించి సన్మానించడం అభినందనీయమని మంత్రి అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆపద సమయంలో వచ్చిన రోగులను ఆత్మీయంగా పలకరించి వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి సూచించారు. హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచంలోనే ఉత్తమ చికిత్స అందించే ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన వివరించారు.

'హైదరాబాద్​ను ఉత్తమ చికిత్స అందించే ప్రాంతంగా తీర్చిదిద్దుతాం'

ఇవీ చూడండి: "పుర' ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థికి సహకరించాలి"

Last Updated : Dec 30, 2019, 8:41 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details