తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన ప్రజాపాలన- దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్న మంత్రులు - ప్రజాపాలన అప్డేట్స్

Ministers Participate in Prajapalana Programme : అయిదు గ్యారంటీల అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. ఈకార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్న మంత్రులు అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందేలా పూర్తి సమాచారం సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

Prajapalana Latest Updates
Ministers Participate in Prajapalana Programme

By ETV Bharat Telangana Team

Published : Jan 6, 2024, 8:24 PM IST

ముగిసిన ప్రజాపాలన- దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్న మంత్రులు

Ministers Participate in Prajapalana Programme : కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలే లక్ష్యంగా చేపట్టిన ప్రజా పాలన(Praja Palana) కార్యక్రమం ముగిసింది. సంక్షేమ పథకాల అమలు కోసం వారం రోజులుగా అర్హులందరి నుంచి అధికారులు అర్జీలు స్వీకరించారు. చివరి రోజు ప్రజాపాలనలో పెద్దఎత్తున పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు అభయహస్తం ధరఖాస్తుల్ని స్వీకరించారు.

మూడు కస్టర్లుగా తెలంగాణ విభజన : సీఎం రేవంత్​ రెడ్డి

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బనిగండ్లపాడులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పాల్గొన్నారు. అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ విధానాన్ని పరిశీలించిన భట్టి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించిన సీతక్క ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

Prajapalana Latest Updates :సిద్దిపేట జిల్లా హూస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌(Ponnam) పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన మంత్రి అసలైన లబ్ధిదారులను గుర్తించి సంక్షేమ పథకాలను అందిస్తామని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లాలోని బతుకమ్మ కుంట, ఇందిరానగర్‌ కాలనీల్లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు.

గ్యారంటీల అమలు జరిగేలా బడ్జెట్ రూపకల్పన కోసమే ప్రజాపాలన దరఖాస్తులు : భట్టి విక్రమార్క

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియను స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పుట్టగూడెం, కొండేటి చెరువు గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు బిచ్కుంద మండలం రాజారాం తండాలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రజల వద్దకే ప్రజాపాలన తెచ్చామన్న మంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు గ్యారంటీలు అమలు చేశామన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన మంత్రి త్వరలోనే సమస్యలు పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలోని నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరావు పర్యవేక్షించారు. ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం దరఖాస్తులు సమర్పించని వారు ఆందోళన చెందొద్దని ప్రతీ నాలుగు నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

ప్రజాపాలన నిరంతర ప్రక్రియ. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. గత బీఆర్ఎస్‌ పాలనలో ఆర్థిక అరాచకం జరిగింది. వాటన్నింటిని అధిగమిస్తూ అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తాం. - భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి

జుక్కల్‌లో మంత్రి జూపల్లి పర్యటన - కౌలస్‌కోటను అభివృద్ధి చేస్తామని హామీ

ABOUT THE AUTHOR

...view details