మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సీఎం కేసీఆర్‌కు 66వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తనకు తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ధైర్యవంతుడు, దయ కలిగిన వ్యక్తి కేసీఆర్ అని.. అతన్ని తాను తండ్రిగా పిలవడం గర్వకారణమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ దీర్ఘకాలం జీవించాలని.. తన నిబద్ధతతో మరింత స్పూర్తి నింపాలని ఆకాంక్షించారు. 'తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ తారక రామారావు ట్విటర్లో పోస్ట్ చేశారు.
తెలంగాణ.. కేసీఆర్ స్వప్నమని, ప్రత్యేక రాష్ట్రం తన త్యాగఫలమని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి తన దక్షతకు నిదర్శనమని... తెలంగాణ గడ్డకు కేసీఆరే శ్రీరామ రక్ష అంటూ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ట్విటర్ ద్వారా తెలిపారు. తెలంగాణ జాతిపిత, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శతవసంతాలు జీవించాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.