తెలంగాణ

telangana

ETV Bharat / state

నిధుల సమీకరణపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు - Telangana Govt

Meeting at BRK Bhavan on fundraising: నిధుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో సమావేశమైంది. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చులు పెరిగిపోతున్నందున ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధుల సమీకరణపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.

నిధుల సమీకరణపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు
నిధుల సమీకరణపై ప్రభుత్వం తీవ్ర కసరత్తు

By

Published : Sep 19, 2022, 4:01 PM IST

Meeting at BRK Bhavan on fundraising: నిధుల సమీకరణపై మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో సమావేశమైంది. ఈ భేటీలో మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్‌ హాజరయ్యారు. వాళ్లతో పాటుగా రా‌ష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు, ఉద్యోగుల జీతభత్యాలు తదితర ఖర్చులు పెరిగిపోతున్నందున ప్రత్యామ్నాయ మార్గాల్లో నిధుల సమీకరణపై సమావేశంలో చర్చించారు. వివిధ ప్రభుత్వం శాఖల్లో పన్ను వసూళ్ల లక్ష్యాన్ని పెపొందించే చర్యలపైనా సమాలోచనలు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details