75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.... జిల్లాల్లో మంత్రులు మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి... పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ప్రగతిదారుల వెంట వేగంగా పయనిస్తోందని పేర్కొన్నారు. పురోగమనాన్ని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ఎదురవుతాయని... సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అవలీలగా ఎదుర్కొవచ్చని రాష్ట్రం రుజువు చేసిందని అభిప్రాయపడ్డారు. సిరిసిల్లలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు.
జెండా వందనం కార్యక్రమంలో కేటీఆర్ దళిత బంధు పథకం విజయవంతం కావడానికి ప్రణాళిక, అమలుతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా తప్పనిసరి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో దళిత బంధు కమిటీలు ఏర్పాటు చేసేలా ఆలోచిస్తున్నాం. తెలంగాణ మాత్రమే కాకుండా దేశ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఎస్సీ వర్గాలను ప్రధాన స్రవంతిలో తీసుకురావడానికి చేపట్టిన ఈ పథకం దేశ దశ-దిశగా నిర్దేశించనుంది. రాష్ట్రం ప్రగతిదారుల వెంట వేగంగా పయనిస్తోంది. యావత్ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. పురోగమనాన్ని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ఎదురవుతాయి. ఆనాడు ఉద్యమ సమయంలోనూ ఎదురయ్యాయి. సంకల్పం గట్టిదైతే ఎన్ని అవరోధాలనైనా అవలీలగా ఎదుర్కొవచ్చు.
-కేటీఆర్, మంత్రి
త్రివర్ణ పతాకం ఎగురవేస్తున్న హరీశ్
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలో జరిగిన వేడుకల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.వికారాబాద్‌లో ఉపసభాపతి పద్మారావు, రంగారెడ్డి కలెక్టరేట్‌లో సబితాఇంద్రారెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి.... జాతీయ గీతాన్ని ఆలపించారు. నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, నిజామాబాద్‌లో రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
స్వాతంత్య్ర దినోత్సవంలో గంగుల కమలాకర్ కరీంనగర్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.... పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మేడ్చల్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవానికి కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. నల్గొండలో జరిగిన వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొని.... పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సూర్యాపేటలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, మహబూబాబాద్‌లో గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. మహబూబ్‌నగర్‌లో సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వనపర్తిలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, మెదక్‌లో తలసాని శ్రీనివాస్‌యాదవ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. హన్మకొండ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో.... ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని.... పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్య్ర సమరయోధులను ఆయన సత్కరించారు.
జగిత్యాల జిల్లా కేంద్రం పురాతన ఖిల్లాలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ఆయన జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడి జిల్లా ప్రజలకు పంద్రాగస్టు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ రవి, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
జెండా ఆవిష్కరిస్తున్న మొహమూద్ అలీ ఇదీ చదవండి:pocharam srinivas reddy: 'రాష్ట్ర ప్రగతి, ప్రజల సంక్షేమానికి పునరంకితం అవుదాం'