తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక ఇంజినీర్: వేముల

ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజిక ఇంజినీర్ అని కొనియాడారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నవాబ్ అలీ బహదూర్ జంగ్ 142వ జయంతి సందర్భంగా హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్​లో నిర్వహించిన తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు.

By

Published : Jul 11, 2019, 6:11 PM IST

కేసీఆర్ సామాజిక ఇంజినీర్: వేముల

ముఖ్యమంత్రి కేసీఆర్ రోజూ మిషన్ భగీరథ, 24 గంటల విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టుల పురోగతి తెలుసుకోకుండా కనీసం అల్పాహారం కూడా తీసుకోరని రహదార్లు, భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాత్రి పడుకునే ముందు కూడా ఈ ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటారని పేర్కొన్నారు. నవాబ్ అలీ బహదూర్ జంగ్ 142వ జయంతి సందర్భంగా హైదరాబాద్ విశ్వేశ్వరయ్య భవన్​లో నిర్వహించిన తెలంగాణ ఇంజినీర్ల దినోత్సవంలో మంత్రి.... ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎంతగానో ఉందన్న మంత్రి... మిషన్ భగీరథ, నిరంతర విద్యుత్, కాళేశ్వరం ప్రాజెక్టులు వారి శ్రమతోనే పూర్తయ్యాయన్నారు.

ఇంజినీర్ అయినందుకే తనకు సంబంధిత శాఖల బాధ్యతలను సీఎం అప్పగించారని తెలిపారు. నవాబ్ అలీ జంగ్ తరహాలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల జీవితాలు బాగుపడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని... త్వరలోనే ఆ రోజులను చూస్తామని ప్రశాంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. నవాబ్ అలీ జంగ్ జీవితచరిత్రను పాఠ్యాంశంగా చేర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. సర్వీసు కాలంలో విలువైన సేవలు అందించిన విశ్రాంత ఇంజినీర్లు పెంటారెడ్డి, వెంకటరామారావు, జ్ఞానేశ్వర్, కిషన్​లకు నవాబ్ అలీ జంగ్ జీవితసాఫల్య పురస్కారాలను అందజేశారు.

కేసీఆర్ సామాజిక ఇంజినీర్: వేముల

ఇవీ చూడండి: టీమిండియాకు బై చెప్పేసిన ఫర్హాట్..

ABOUT THE AUTHOR

...view details