Minister Uttam Kumar Reddy Fires on L and T Representatives :రాష్ట్రంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను అంత నాణ్యత లేకుండా ఎలా చేస్తారని, నిర్మాణాలకు సంబంధించి పనులు చేసినఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులపై నీటిపారుదుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సచివాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎల్ అండ్ టీ గ్రూప్ డైరెక్టర్ ఎస్వీ దేశాయ్, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
యాసంగి పంటకు నీటి విడుదల, మేడిగడ్డ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ(L&T Company) , పునరుద్ధరణ పనులకు సంబంధించి వివరాలపై మంత్రి ఆరా తీశారు. ఏదో ఒక లెటర్ అధికారికి ఇచ్చి తమ ప్రమేయం లేదని తప్పించుంటే మాత్రం ఊరుకోమని ఆయన అన్నారు. ప్రజా ధనాన్ని వృథా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవ్వరిని వదిలిపెట్టమని మంత్రి ఉత్తమ్ హెచ్చరించారు.
అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు ఏజెన్సీలను కూడా పిలిచి మాట్లాడతామని, తప్పు చేసిన వారు తప్పించుకోవాలని చూస్తే న్యాయ పరంగా, చట్ట పరంగా చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మేడిగడ్డపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
CM Revanth Reddy in Review of Irrigation Sector:కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో(Kaleshwaram project) కుంగుబాటుకు గురైన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాలివ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం ఆదివారం తన నివాసంలో ఇంజినీర్లతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.