ఈనెల 7న హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీవీమార్గ్ జలవిహార్‌లో తెరాస హైదరాబాద్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి తలసాని పరిశీలించారు. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరవుతారు.
పార్టీని బలోపేతం చేయడానికి బస్తీ నుంచి హైదరాబాద్ వరకు కమిటీ ఎన్నికలపై చర్చిస్తామని తలసాని స్పష్టం చేశారు. తెరాసకు రాష్ట్ర వ్యాప్తంగా 60లక్షల సభ్యత్వాలు ఉన్నాయని... తెలంగాణలో తిరుగులేని శక్తిగా తెరాస ఎదిగిందన్నారు. తాడు బొంగరం లేని వాళ్లు కూడా పార్టీని, కేసీఆర్‌ను విమర్శిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. హైదరాబాద్ అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు.
ఈనెల 7న హైదరాబాద్ నగర సర్వసభ్య సమావేశం జరగనుంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. స్థానిక మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొంటారు. పార్టీని బలోపేతం చేయడానికి, బస్తీ బూత్ కమిటీ, డివిజన్ కమిటీ, హైదరాబాద్ జిల్లా కమిటీలు, అనుబంధ కమిటీలను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. పార్టీ సభ్యత్వం నమోదు ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తైంది. రాష్ట్రంలో పేద, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అవకాశాలు వచ్చాయంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ ద్వారా మాత్రమే. తాడు, బొంగరం లేనోళ్లు ఏదేదే మాట్లాడుతున్నారు. టీవీలో కనిపించడానికనిచెప్పి చట్టసభలల్లో చట్టాలను చేసే వాళ్లను మనం చూస్తున్నాం.- తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
talasani: 'ఈనెల 7న జలవిహార్‌లో తెరాస పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశం' ఇదీ చూడండి:Uttam kumar reddy on trs: 'తెరాస ప్రభుత్వంలో మహిళలకు తీవ్ర అన్యాయం'