హైదరాబాద్ బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్ బస్తీకి చెందిన తెరాస పార్టీ ముఖ్య నాయకుడు రహీం కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. రహీం సోమవారం గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి రహీం ఇంటికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.
రహీం కుటుంబానికి తలసాని పరామర్శ.. రూ.లక్ష అందజేత
తెరాస పార్టీ ముఖ్యనేత రహీం సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. హైదరాబాద్ బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్ బస్తీలోని ఆయన నివాసానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.
రహీం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి తలసాని
అనంతరం కుటుంబసభ్యులను పరీమర్శించి రూ.లక్షను మంత్రి తన వ్యక్తిగతంగా రహీం కుటుంబసభ్యులకు అందజేశారు. మంత్రితోపాటు కార్పొరేటర్ ఉప్పుల తరుణి, నరేందర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి:ఈటల ఓఎస్డీకి కరోనా... గత 2రోజులుగా ఆయనతోనే మంత్రి