హైదరాబాద్ కిరాణా మర్చంట్ అసోసియేషన్ అభ్యర్థనపై మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, రాజాసింగ్ బేగంబజార్లో పర్యటించారు. అక్కడ వ్యాపారులతో సమావేశమయ్యారు.
బేగంబజార్లో వ్యాపారులతో మంత్రి తలసాని సమావేశం - బేగంబజార్లో వ్యాపారులతో మంత్రి సమావేశం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బేగంబజార్లో పర్యటించారు. అక్కడి వ్యాపారులతో సమావేశమయ్యారు. దుకాణాలైనా తెరిచేందుకు అనుమతివ్వాలని వ్యాపారులు మంత్రిని కోరారు. అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి తలసాని.
బేగంబజార్లో వ్యాపారులతో మంత్రి తలసాని సమావేశం
బేగం బజార్, ముక్తర్ గంజ్, కిషన్గంజ్ మార్కెట్ల నుంచే నిత్యవసర వస్తువులు నగరంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతాయని వ్యాపారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రోజుకు కొన్ని దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీని వల్ల నిత్యవసర వస్తువుల ధరలు దిగివచ్చే అవకాశం ఉందన్నారు. స్పందించిన తలసాని.. ముఖ్యమంత్రి, ఇతర అధికారులు, పోలీసులుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇవీచూడండి:కరోనా నియంత్రణపై మంత్రి ఈటల సమీక్ష