తెలంగాణ

telangana

ETV Bharat / state

పదా అన్న ఇళ్లు చూసివద్దాం... భట్టితో తలసాని - డబుల్​ బెడ్​రూం ఇళ్లను పరిశీలించిన భట్టి

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను హైదరాబాద్​లో నిర్మిస్తోన్న రెండు పడకగదుల ఇళ్లను చూసేందుకు మంత్రి తలసాని వెంట తీసుకెళ్లారు. అసెంబ్లీలో నిన్న జరిగిన చర్చలో హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడ కట్టారో చూపించాలని భట్టి డిమాండ్ చేశారు. స్పందించిన మంత్రి తలసాని బంజారాహిల్స్‌లోని భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి వివరించారు. అక్కడి నుంచి ఇళ్లను చూపించేందుకు తనతో తీసుకెళ్లారు.

batti talasani
batti talasani

By

Published : Sep 17, 2020, 12:06 PM IST

Updated : Sep 17, 2020, 12:38 PM IST

శాసనసభలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధ్య బుధవారం ఆసక్తికర చర్చ జరిగింది. ప్రభుత్వానికి ఎన్నికల్లోనే డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్లు గుర్తుకువస్తాయని భట్టి విమర్శించారు. హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడ కట్టారో చూపించాలని సవాల్ విసిరారు. భట్టి ఇంటికి వెళ్లి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల గురించి చెబుతానని మంత్రి తలసాని పేర్కొన్నారు. అన్నట్లుగానే.. ఇవాళ ఉదయం బంజారాహిల్స్‌లోని భట్టి విక్రమార్క నివాసానికి తలసాని వెళ్లారు.

మంత్రి బృందానికి భట్టి స్వాగతం పలికారు. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఎక్కడున్నాయో తలసాని వివరించారు. వాటిని చూపించేందుకు భట్టిని తన కారులో మంత్రి తలసాని తీసుకెళ్లారు.

పదా అన్న ఇళ్లు చూసివద్దాం... భట్టితో తలసాని

ఇదీ చదవండి :తెలంగాణ భవన్‌లో జెండాను ఎగురవేసిన మంత్రి కేటీఆర్​

Last Updated : Sep 17, 2020, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details