ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం గురువారం మధ్యాహ్నం ఒంటిగంటలోపు పూర్తవుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హుస్సేన్సాగర్ వద్ద నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనతోపాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ పరిసరాలతోపాటు వివిధ ప్రాంతాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారని పేర్కొన్నారు. ఖైరతాబాద్ వినాయకుడు పూర్తిగా నిమజ్జనం అయ్యేలా హుస్సేన్‌సాగర్‌లో పూడికను తీశారని అన్నారు. క్రేన్ నంబరు 6 వద్ద నిమజ్జనం చేస్తామన్నారు. గ్రేటర్లో 3,600 విగ్రహాలు 12న నిమజ్జనం కానున్నాయని మంత్రి వెల్లడించారు.
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఖైరతాబాద్ వినాయకుడు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఎన్టీఆర్ మార్గుకు చేరుతుందని... ఒంటిగంటకు నిమజ్జనం అవుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని చెప్పారు.
ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం