ప్రపంచ పశు వైద్య దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. హైదరాబాద్‌లోని విద్యానగర్ రెడ్‌క్రాస్ రక్తనిధి కేంద్రంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు.
'స్వచ్ఛందంగా ముందుకు రండి... రక్తదానం చేయండి'
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆస్పత్రుల్లో రక్తం కొరత ఏర్పడింది. ఆ లోటును తీర్చేందుకు రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.
'స్వచ్ఛందంగా ముందుకు రండి... రక్తదానం చేయండి'
రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన పశువైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. కరోనా సంక్షోభం సమయంలో రక్తం కొరత చాలా ఉందని... ఈ క్లిష్ట పరిస్థితుల్లో రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు.
ఇవీ చూడండి:'భాజపా మెడికల్ పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలి'