తెలంగాణ

telangana

ETV Bharat / state

సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తలసాని - సర్దార్ పటేల్ విగ్రహం

సికింద్రాబాద్ సర్దార్​పటేల్ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంతో పాటు నూతన ద్వారాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఎంతో మంది గొప్ప వ్యక్తుల్ని తయారు చేసిన ఘనత ఎస్​పీ కళాశాలకు దక్కిందన్నారు.

సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తలసాని

By

Published : Aug 31, 2019, 6:26 AM IST


హైదరాబాద్​ పద్మారావునగర్​లోని సర్దార్ పటేల్ కళాశాల సర్దార్ పటేల్ విగ్రహంతో పాటు నూతన ద్వారాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. నూతన వసతి గృహాన్ని ప్రారంభించారు. పరేడ్​లో పాల్గొన్న ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​ విద్యార్థిని విద్యార్థులను మంత్రి అభినందించారు.దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక్కరని గుర్తు చేశారు. కళాశాలలో చదవకపోయినా గత 27 ఏళ్ల నుంచి తన రాజకీయ జీవితానికి కళాశాలకు సంబంధముందన్నారు. సర్దార్ పటేల్ కళాశాలలో చదువుకున్న వారంతా మంచి స్థానంలో ఉన్నారని తెలిపారు. మంత్రులు మల్లారెడ్డి, నిరంజన్ కూడా ఇదే కళాశాలలో చదువుకున్నారని ఆయన గుర్తు చేశారు . ఎగ్జిబిషన్ సొసైటీ వారు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలతో పోటీపడుతూ సేవాభావంతో కళాశాలను నడుపుతున్నారని కొనియాడారు.

సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి తలసాని

ABOUT THE AUTHOR

...view details