దుబ్బాక ఘటనపై భాజపా నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని రాష్ట్ర పశుంసవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. భాజపా కన్నా తమ బలం పదింతలు ఎక్కువేనని.. సంస్కారాన్ని విడిచిపెడితే అంతకన్నా ఎక్కువే మాట్లాడగలమన్నారు. సీఎం, మంత్రులు అనే గౌరవం కూడా లేకుండా ఏకవచనంతో మాట్లాడితే ప్రజలు వారినే చీదరించుకుంటారన్నారు. ఎన్నికల సమయంలో సోదాలు సాధారణంగా జరుగుతాయని.. మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, తెరాస అభ్యర్థి సుజాత ఇళ్లల్లో కూడా జరిగాయన్నారు.
తమకు అరవై లక్షల కార్యకర్తల బలం ఉందని.. తాము కూడా అదే విధంగా ముట్టడిలు చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని తలసాని వ్యాఖ్యానించారు. బాధ్యాతాయుత పదవుల్లో ఉన్న కేంద్ర మంత్రి, ఎంపీ కూడా ఏం జరిగిందో తెలుసుకోకుండా.. అక్కడికి వెళ్లి హంగామా చేశారన్నారు. దొంగే.. 'దొంగ దొంగ' అన్నట్లు భాజపా నేతలు వ్యవహరిస్తున్నారని తలసాని మండిపడ్డారు.