సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ పేట్ సోమప్ప మఠంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై బస్తీ వాసులతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. బస్తీలోని ఇళ్ల సమస్యలు పరిష్కరించాలని స్థానికులు మంత్రిని కోరారు.
శివరాత్రి వేడుకల్లో తలసాని ప్రత్యేక పూజలు - hyderabad today latest news
బన్సీలాల్ పేట్ సోమప్ప మఠంలో శివరాత్రి వేడుకలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరై బస్తీ వాసులతో కలిసి పూజలో పాల్గొన్నారు. బస్తీలోని ఇళ్ల సమస్యలు పరిష్కరించాలని స్థానికులు మంత్రిని కోరగా, పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
శివరాత్రి వేడుకల్లో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి
త్వరలోనే కలెక్టర్, దేవాదాయ శాఖ కమిషనర్‌తో కలిసి బస్తీలో పర్యటిస్తామని తలసాని తెలిపారు. గత కొన్నేళ్లుగా బస్తీలోనే జీవనం సాగిస్తున్న పేదల ఇళ్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. బస్తీ వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సోమప్ప మఠం వాసుల ఇళ్ల సమస్యను కూడా పరిష్కరిస్తామన్నారు.
ఇదీ చూడండి :బాధితులకు సాయం లేదు.. నిందితులకు ఉరిశిక్షలేదు...