కరోనా నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ జంట నగరాల్లో బోనాల పండగ నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గతేడాది కరోనా విజృంభణ కారణంగా.. బోనాల పండుగను వైభవంగా నిర్వహించలేకపోయామన్న తలసాని.. ఈసారి పెద్దఎత్తున చేసేందుకు సర్వం సిద్ధం చేస్తున్నామన్నారు. నేడు గోల్కొండ బోనాలు, ఈనెల 25,26 తేదీల్లో ఉజ్జయిని మహంకాళి బోనాలు, ఆగస్టు 1న ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాలు ఉంటాయన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే.. అమ్మవారికి బోనం సమర్పించాలనే ఉత్సాహంతో భక్తులు ఉన్నారంటున్న మంత్రి తలసానితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి..
TALASANI: 'కరోనాను తరిమికొట్టాలంటే.. అమ్మవారికి బోనం సమర్పించాల్సిందే' - తెలంగాణ తాజా వార్తలు
హైదరాబాద్‌లో జరిగే బోనాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను ఉట్టిపడే విధంగా బోనాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
MINISTER TALASANI