తెలంగాణ

telangana

ETV Bharat / state

మేం కట్టింది ఒక దగ్గర.. మీరు చూసింది మరో దగ్గర: తలసాని - మంత్రి తలసాని వార్తలు

పేదవాడికి రెండు పడకగదుల ఇళ్లు కట్టే రాష్ట్రం దేశంలో మరొకటి లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లకు సంబంధించిన జాబితాను కాంగ్రెస్​ నేతలకు ఇచ్చామని దాని ప్రకారం చూసుకోవాలన్నారు. కరోనా సమస్యలున్నా ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం ఒక్కరోజులో పూర్తికాదని పేర్కొన్నారు.

talasani srinivas yadav
talasani srinivas yadav

By

Published : Sep 22, 2020, 3:56 PM IST

రెండు పడకగదుల ఇళ్లపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేతలకు అర్హత లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇళ్ల విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని తెలిపారు. నాంపల్లిలో ఇళ్లు కట్టింది ఒక దగ్గర అయితే కాంగ్రెస్​ నేతలు చూసింది మరో దగ్గరని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో ఎక్కడ ఇళ్లు కడుతున్నామో తెలుసుకొని వెళ్లండని తలసాని సూచించారు.

మేం కట్టింది ఒక దగ్గర.. మీరు చూసింది మరో దగ్గర..: తలసాని

ప్రభుత్వ పాలన మెచ్చుకుని తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయి. కేసీఆర్‌ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు అతీగతీ లేదు. కాంగ్రెస్‌కు జీహెచ్‌ఎంసీలో పోటీకి 150 మంది అభ్యర్థులు ఉన్నారా?

- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఇదీ చదవండి :రెవెన్యూ చట్టాల గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ABOUT THE AUTHOR

...view details