సనత్ నగర్ నియోజకవవర్గ పరిధిలోని రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాంగోపాల్ పేట డివిజన్ జీరాబస్తీలో రూ.23 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన రహదారులతో పాటు.. అంతర్గత రహదారులను కూడా పూర్తి స్థాయిలో నిర్మించనున్నట్టు ఆయన తెలిపారు.
అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి తలసాని
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాంగోపాల్‌పేట డివిజన్లోని జీరాబస్తీలో రూ.23 లక్షల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.
అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి తలసాని
ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్టు మంత్రి తెలిపారు. అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి.. అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, డీసీ ముకుందరెడ్డి, ఏసీ రవి, వాటర్ వర్క్స్ జీఎం రమణారెడ్డి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ శ్రీనివాస్, ఏఎంఓహెచ్ రవీందర్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి :'మెడికల్ హబ్‌గా హైదరాబాద్ మహానగరం'