భాగ్యనగరంలో ప్రజలు ఆహ్లాదంగా గడిపేందుకు గేమింగ్ కేంద్రాలు రావడం ఆనందంగా ఉందని మంత్రి తలసాని శ్రీవివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గో కార్ట్ గేమింగ్ కేంద్రాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కాసేపు గో కార్టులో చక్కర్లు కొడుతూ ఉల్లాసంగా గడిపారు. నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. మరిన్ని క్రీడా కేంద్రాలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మరిన్ని క్రీడా కేంద్రాలు రావాలి: మంత్రి తలసాని - క్రీడా కేంద్రాలు
హైదరాబాద్‌లో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన గేమింగ్ కేంద్రాన్ని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌తో కలిసి మంత్రి తలసాని ప్రారంభించారు. నగర జనాభాకు తగినట్టుగా మరిన్ని క్రీడా కేంద్రాలు రావాల్సిన అవసరం ఉందన్నారు.
మరిన్ని క్రీడా కేంద్రాలు రావాలి: మంత్రి తలసాని
Last Updated : Jun 10, 2019, 9:47 AM IST