తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందాం: మంత్రి తలసాని - మట్టి వినాయకులను పంపిణీ చేసిన మంత్రి తలసాని

హైదరాబాద్​ సనత్​నగర్​లో మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ మట్టి వినాయకులను పంపిణీ చేశారు. కరోనా దృష్ట్యా ఈ ఏడాది పండుగలను వైభవంగా జరగడం లేదని.. వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందామని మంత్రి పేర్కొన్నారు.

minister talasani distributed clay ganesha
వచ్చే ఏడాది ఘనంగా జరుపుకుందాం: మంత్రి తలసాని

By

Published : Aug 19, 2020, 1:53 PM IST

పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం మట్టి వినాయకులను ప్రోత్సహించే సదుద్దేశంతో బుధవారం పశుసంక్షేమ శాఖ భవనం వద్ద మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. స్వాతి ప్రమోటర్స్​ ఆధ్వర్యంలో సనత్​నగర్​ నియోజకవర్గంలో 10వేల మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పాల్గొని... పంపిణీ చేశారు.

కరోనా దృష్ట్యా ఈ ఏడాది పండుగలు వైభవంగా జరగడం లేదని మంత్రి అన్నారు. వచ్చే ఏడాది ప్రతి పండుగను ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు.

ఇదీ చూడండి:కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!

ABOUT THE AUTHOR

...view details