తెలంగాణ

telangana

ETV Bharat / state

నివాస పరిసరాలను శుభ్రపరిచిన మంత్రి తలసాని ​ - minister talasani srinivas

మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ వెస్ట్​ మారేడ్​పల్లిలోని తన నివాసంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. సీజనల్​, డెంగ్యూ వ్యాధి నివారణకు సర్కారు అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని వ్యాధుల నివారణకు కృషి చేయాలని సూచించారు.

ఇళ్లు శుభ్రం చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్​

By

Published : Sep 15, 2019, 9:28 PM IST

రాష్ట్రంలో సీజనల్, డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వెస్ట్ మారేడ్​పల్లిలోని తన నివాసంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని వ్యాధుల నివారణకు కృషి చేయాలని సూచించారు. ప్రస్తుత వర్షాకాలంలో భాగ్యనగరంలో అంటువ్యాధులు ప్రబలకుండా జీహెచ్​ఎంసీ పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుందని అన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, నీలోఫర్ ఆసుపత్రుల్లో 25 మంది చొప్పున అదనపు డాక్టర్లతో అదనపు ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేశామని వివరించారు. 95 అర్బన్ సెంటర్లలో ఈవినింగ్ క్లినిక్​లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 150 రకాల మందులు బస్తీ దవాఖానాలలో ఉచితంగా పంపిణీ చేస్తున్నామని అన్నారు.

నివాస పరిసరాలను శుభ్రపరిచిన మంత్రి తలసాని ​

ABOUT THE AUTHOR

...view details