తెలంగాణ

telangana

ETV Bharat / state

పర్యాటక రంగానికి నిధులు కేటాయించడం సంతోషకరం: శ్రీనివాస్ గౌడ్

బడ్జెట్‌లో టూరిజం అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన ఆయన.. సీఎంకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

minister-srinivas-goud-thanks-to-cm-kcr-for-tourism-funds-allocations-in-budget
పర్యాటక రంగానికి నిధులు కేటాయించడం సంతోషకరం: శ్రీనివాస్ గౌడ్

By

Published : Mar 23, 2021, 3:34 PM IST

టూరిజం అభివృద్ధికి బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించడం పట్ల ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీ‌నివాస్ గుప్తతో కలిసి ప్రగ‌తి భ‌వ‌న్‌లో సీఎంని కలిసి కాసేపు ముచ్చటించారు. టూరిజం అభివృద్ధి కోసం బ‌డ్జెట్‌లో రూ.726 కోట్లు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ఇటీవల జ‌రిగిన ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సమష్టి కృషితో ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డి, సుర‌భి వాణీ దేవి అత్యధిక మెజార్టీతో గెలుపొందారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌కు 30 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడం, వ‌యో ప‌రిమితి 61 ఏళ్లకు పెంచ‌డం ప‌ట్ల కృత‌జ్ఞత‌లు తెలిపారు. ఈ నిర్ణయం వ‌ల్ల రాష్ట్రంలోని ఉద్యోగులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నార‌ని సీఎంకు వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల విష‌యంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ప‌ట్ల స‌ర్వత్రా హ‌ర్షం వ్యక్తం అవుతోంద‌న్నారు.

ఇదీ చదవండి:కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఎప్పుడు?: నామ

ABOUT THE AUTHOR

...view details