కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ పరిధిలోని పలు కాలనీల్లో పర్యటించి గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్.పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్న తమకు కనీసం కరెంటు, మంచినీటిని సరఫరా చేయక అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిస్తున్నారని వాపోయారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇందిరా గాంధీ నగర్, ప్రశాంత్ నగర్ ప్రజల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే వారికి కరెంటు స్తంభాలు ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. గుడిసెల్లో నివాసం ఉంటున్న వారికి త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించేందుకు ప్రతిపాదనలు చేస్తానని తెలిపారు.
గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ - minister
కూకట్పల్లి నియోజకవర్గంలోని ఇందిరానగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పర్యటించి గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. స్థానిక సమస్యలను త్వరలోనే పరిష్కరించి మంచినీటి సరఫరా, కరెంట్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించడానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి తెలిపారు.
గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్